పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టులో విచారణ వాయిదా
Advertisement
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టగానే పంచాయతీ కార్యాలయాలకు సైతం పార్టీ రంగులు వేయడం తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారణ జరిగింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటికి రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
Mon, Jan 27, 2020, 06:52 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View