చనిపోయింది నేను కాదు.. మరో సెజల్ శర్మ: టీవీ నటి సెజల్ శర్మ స్పష్టీకరణ
27-01-2020 Mon 15:01
- టీవీ నటి ఆత్మహత్య
- మరో నటి ఫొటోతో మీడియా ప్రచారం
- ఆవేదన వ్యక్తం చేసిన సెజల్

ఇటీవల సెజల్ శర్మ అనే బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుందన్న విషయం మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చింది. ఆ యువనటి ఫొటోలతో సహా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడా వ్యవహారం ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
చనిపోయింది మరో సెజల్ శర్మ అని, తన ఫొటో పెట్టి ఎందుకు రాశారంటూ ఇంకో సెజల్ శర్మ తెరపైకి వచ్చింది. నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను అంటూ సెజల్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించడంతో అభిమానులు దిగ్భ్రమకు గురయ్యారు. సెజల్ శర్మ అనే పేరున్న మరో నటి మరణిస్తే, తాను చనిపోయినట్టు ప్రచారం చేశారని, తాను క్షేమంగా ఉన్నానని వివరించింది. మీడియా వాళ్లను చూస్తుంటే పిచ్చి పడుతోంది. వాస్తవాలు తెలుసుకోవద్దా! నా ఫొటోతో ఎలా ప్రసారం చేస్తారు? అంటూ మండిపడింది.
More Latest News
పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
1 hour ago

‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
1 hour ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
2 hours ago
