అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ లకు 'పద్మ విభూషణ్'.. ఆనంద్ మహీంద్రాకు 'పద్మ భూషణ్'
Advertisement
గణతంత్ర వేడుకల ముంగిట కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. ఏడుగురికి 'పద్మ విభూషణ్', 16 మందికి 'పద్మ భూషణ్', 118 మందికి 'పద్మశ్రీ' అవార్డులు ప్రదానం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రులు దివంగత అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్ లకు ప్రజా వ్యవహారాల విభాగంలో 'పద్మవిభూషణ్' ప్రకటించారు. ఇదే విభాగంలో మారిషస్ మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్, భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ లకు  కూడా 'పద్మ విభూషణ్' అందించనున్నారు. ఇక, 'పద్మభూషణ్' అవార్డుల విషయానికొస్తే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను విశిష్ట గౌరవం వరించింది. వినోద రంగం నుంచి కంగన రనౌత్, ఏక్తా కపూర్ లను 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపిక చేశారు.
Sat, Jan 25, 2020, 10:03 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View