ఐదుగురు తెలుగువాళ్లకు 'పద్మ' పురస్కారాలు
Advertisement
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు కేంద్రం క్రీడారంగంలో 'పద్మభూషణ్' ప్రకటించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న సింధు ప్రతిభకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం వరించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఐదుగురు తెలుగువాళ్లకు పురస్కారం లభించింది. పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైంది. శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)లకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం),  దళవాయి చలపతిరావు (కళారంగం)లను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.

Sat, Jan 25, 2020, 09:39 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View