కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుక గణతంత్ర దినోత్సవం: పవన్ కల్యాణ్
Advertisement
రేపు 71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుక గణతంత్ర దినోత్సవం అని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి పరిఢవిల్లేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

కాగా, రేపు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.
Sat, Jan 25, 2020, 06:32 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View