పవన్ కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన దిల్ రాజు!
Advertisement
ఇటీవల రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా పింక్ చిత్రం రీమేక్ లో నటించడానికి సమాయత్తమవుతూ, అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో అమితాబ్ లీడ్ రోల్ పోషించారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో నటిస్తున్న ఇతర తారాగణంలో నివేదా థామస్, అంజలి.. తదితరులున్నారు.

ఇదిలావుంచితే, ఒకవైపు రాజకీయాలతో బిజీగా వుండే పవన్ కల్యాణ్ ఈ షూటింగుకు అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చి వెళుతుండడానికి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన దాదాపుగా కోటి రూపాయలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో తాజా రాజకీయాల నేపథ్యంలో.. ఈ సినిమాకోసం పవన్ కేవలం 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారని.. సమయాన్ని ఆదా చేయడానికే ఈ విమానం ఏర్పాటని సినీవర్గాలు చెబుతున్నాయి.
Thu, Jan 23, 2020, 10:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View