ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ వైసీపీ ప్రభుత్వం తీరు.. నారా లోకేశ్ బహిరంగ లేఖ
Advertisement
నిన్న శాసనమండలిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం..’ అంటూ ప్రారంభించిన ఈ లేఖలో దేవాలయం లాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత గలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నానని అన్నారు. వైసీపీ వాళ్ల చిన్నబుద్ధితో ‘పెద్దల సభ’ అయిన శాసనమండలి గౌరవాన్ని మంటగలిపేశారని, మార్షల్స్ రక్షణగా నిలవకపోతే చైర్మన్ షరీఫ్ కు రక్షణ కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితి అంటూ తన లేఖను కొనసాగించారు.
Thu, Jan 23, 2020, 10:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View