సీఎం జగన్ కు చాలా విషయాలు తెలియవు.. పెద్దగా చదువుకోలేదు కూడా!: యనమల రామకృష్ణుడు
Advertisement
సీఎం జగన్ సహా అధికార పక్ష సభ్యులు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా విషయాలు జగన్ కు తెలియవని అన్నారు. జగన్ పెద్దగా చదువుకోలేదని, చదువుకోమని వాళ్ల నాన్న ఆయన్ని అమెరికా పంపిస్తే పారిపోయి వచ్చేశారని విమర్శించారు.

తమ కేబినెట్ లో గొప్పగా చదువుకున్న వాళ్లు ఉన్నారని చెబుతున్న జగన్ కు సలహా ఇచ్చే వారు కూడా లేరని విమర్శించారు. వైసీపీలో ఉన్న వాళ్లు క్రిమినల్ కేసుల్లో ఉన్నారని, ఆ బ్యాచ్ అంతా అసెంబ్లీలో చేరారని ఆరోపించారు. ఇటువంటి బ్యాచ్ అంతా నిన్న శాసనమండలికి వచ్చారని, వాళ్లకు ఏం పని? అని ప్రశ్నించారు.

మామూలుగా మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో కనీసం ఇద్దరు మంత్రులు కూడా రారని, నిన్న మాత్రం చాలా మంది వచ్చారని విమర్శించారు. బిల్లులకు సంబంధించిన మంత్రులను మాత్రమే ఉంచి మిగిలిన వాళ్లను బయటకు పంపమని చైర్మన్ కు నోటీసు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం, శాసనమండలిలో చర్చించిన విషయాలను అసెంబ్లీలోను, శాసనసభలో చర్చించిన విషయాలను కౌన్సిల్ లోనూ ప్రస్తావించకూడదని యనమల అన్నారు.
Thu, Jan 23, 2020, 08:43 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View