'అశ్వద్ధామ' నుంచి ఆకట్టుకునే సాంగ్
Advertisement
లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగశౌర్య, ఈ సారి యాక్షన్ ను ఎక్కువగా టచ్ చేస్తూ 'అశ్వద్ధామ' సినిమా చేశాడు. ఆయన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణ తేజ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు.

"మహి .. చూస్తుంటే నువ్వలా .. అందాల బొమ్మలా .." అంటూ ఈ పాట సాగుతోంది. చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపిస్తూ, ఆ సంబరాన్ని అందరితో కలిసి పంచుకునే అన్నయ్యగా ఈ పాటలో నాగశౌర్య కనిపిస్తున్నాడు. పూజన్ కోహ్లీ ఆలాపన .. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. విశ్వరఘు కొరియోగ్రఫీని అందించిన ఈ సాంగ్ స్క్రీన్ పై మంచి సందడి చేస్తుందనే అనిపిస్తోంది. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు.
Mon, Jan 20, 2020, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View