భువనగిరిలో వార్డు అభ్యర్థికి మహిళా సంఘాల డిమాండ్!
Advertisement
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ధనం ప్రభావం మొదలైందంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో భువనగిరి మునిసిపాలిటీలో అధికార పార్టీ తరఫున వార్డు మెంబర్ గా బరిలోకి దిగిన ఓ అభ్యర్థికి మహిళా సంఘాల నుంచి ఓ డిమాండ్ ఎదురైంది. "మా వద్ద 600 ఓట్లు ఉన్నాయి. రూ. 15 లక్షలు ఇస్తే, అన్ని ఓట్లూ మీకే వేయిస్తాం. ఏమంటారు? ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఓట్లు. ఇదే ఫైనల్. ఇక మీ ఇష్టం..." అంటూ బేరం పెట్టారట.  

ఆయన ఒక్కడికే కాదు. ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచిన మరో ఇద్దరు ప్రధాన అభ్యర్థులను కూడా మహిళా సంఘాల నేతలు ఇదే అడిగారట. డబ్బులు పంచి ఓటర్లను బుట్టలో వేసుకోవాలని అభ్యర్థులు భావిస్తూ, డబ్బులు పంచేందుకు సిద్ధమవుతున్న వేళ, వారికి మహిళా సంఘాల నుంచి ఇటువంటి ఝలక్ వచ్చింది. కాగా, ఓటర్లకు డబ్బులను పంపిణీ చేయడంలో ఈ మహిళా సంఘాలదే కీలక పాత్రని కూడా తెలుస్తోంది.
Mon, Jan 20, 2020, 07:17 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View