నమ్మకస్తులైన కార్మికులే కోట్ల విలువ చేసే వజ్రాలు ఎత్తుకెళ్లారు!
Advertisement
గుజరాత్ లోని సూరత్ లో భారీ చోరీ జరిగింది. ఇక్కడి కత్రాంగావ్ పరిధిలోని ఓ వజ్రాల ఫ్యాక్టరీలో రూ.3 కోట్ల విలువైన వజ్రాలను పనివాళ్లు ఎత్తుకెళ్లారు. ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు వజ్రాలను అప్పగిస్తే వారిద్దరూ అన్నంపెట్టిన సంస్థకే టోకరా వేశారు. మూడు విలువైన వజ్రాలను మరో సంస్థ మేనేజర్ కు అప్పగించాలని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ ఇద్దరు కార్మికులను పురమాయించింది. వారిపై ఎంతో నమ్మకంతో వజ్రాలను ఇచ్చింది. అయితే దురాశతో ఆ కార్మికులు వజ్రాలతో సహా ఉడాయించారు. దీనిపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీకెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Sun, Jan 19, 2020, 08:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View