బన్నీ రాకతో విశాఖలో అభిమానుల జోష్... భారీఎత్తున బైక్ ర్యాలీ
Advertisement
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల... వైకుంఠపురములో చిత్రం భారీ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ కోసం బన్నీ, త్రివిక్రమ్, పూజా హెగ్డే వైజాగ్ రాగా, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలసంఖ్యలో మోటార్ సైకిళ్లతో అభిమానులు బన్నీ వాహనాన్ని వెన్నంటి వచ్చారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన హమ్మర్ వాహనంపైకి ఎక్కి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.
Sun, Jan 19, 2020, 05:52 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View