వైసీపీలోకి కడప జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి?
Advertisement
టీడీపీకి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ దిశలో శివారెడ్డి ఇప్పటికే తన కదలికలను ప్రారంభించారు. తాజాగా కమలాపురం మండలం కోగటం గ్రామంలో  గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డితో కలిసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. అమరావతి రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు.
Sat, Jan 18, 2020, 05:21 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View