జనసేన, బీజేపీ పొత్తుపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలు
Advertisement
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిసారిగా స్పందించారు. రాజధాని అమరావతిని తరలించాలన్న సీఎం జగన్ నిర్ణయంపై జనసేన-బీజేపీ కూటమి పోరాడేట్టయితే వారి కలయికను  స్వాగతిస్తానని వెల్లడించారు.

"పవన్ కల్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సంతోషం. అమరావతిని కొనసాగించడానికి మీ పొత్తును ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కానీ జగన్ అరాచకాలకు మీరు కూడా భయపడిపోయి, పోరాడకపోతే ఉపయోగంలేదు" అని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి పరిరక్షణ కోసం ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Sat, Jan 18, 2020, 04:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View