బన్నీ మూవీలోను అనసూయకి ఛాన్స్ ఇచ్చిన సుకుమార్
Advertisement
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఆంధ్ర నేపథ్యంలో జరిగే కథే అయినప్పటికీ కేరళ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. ఆల్రెడీ తొలి షెడ్యూల్ చిత్రీకరణను ఇటీవలే అక్కడ పూర్తిచేశారు. ఆ సమయంలో బన్నీ బిజీగా ఉండటం వలన, ఆయన కాంబినేషన్లో లేని సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్లో అల్లు అర్జున్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అనసూయ కూడా జాయిన్ కానుందని అంటున్నారు. 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా సుకుమార్ ఇచ్చిన పాత్రకి అనసూయ పూర్తి న్యాయం చేసింది. దాంతో ఆయన అదే తరహా పాత్రను బన్నీ సినిమాలోనూ ఇచ్చాడట. ఈ పాత్ర కూడా తనకి మరింత పేరు తెస్తుందనే ఆశాభావంతో అనసూయ ఉందని అంటున్నారు.
Sat, Jan 18, 2020, 03:05 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View