అమరావతి కోసం ప్రాంతాలకు అతీతంగా అందరూ కదలిరావాలి: చంద్రబాబు
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అమరావతి పరిరక్షణ కోసం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన జిల్లాలోని ఉంగుటూరు మండలంలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి పితాని, మాజీ శాసససభ్యుడు చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఈ సీఎంకు పరిపాలన చేతకాదని విమర్శించారు. ప్రజా వేదికతో మొదలు పెట్టి ప్రతిదీ ధ్వంసం చేస్తున్నారని, ఇప్పుడు అమరావతిలోనూ విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు ఎప్పుడో ఆగిపోయాయని, పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అందరిదీ అని, ప్రాంతాలకు అతీతంగా అందరూ అమరావతి కోసం కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
Sat, Jan 18, 2020, 02:57 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View