డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన: నాగబాబు
Advertisement
'డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన' అంటూ జనసేన నేత నాగబాబు ట్వీట్లు చేశారు. 'దయచేసి మీ తప్పులను సరిదిద్దుకుని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండి. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి' అని పేర్కొన్నారు.

'మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు ఇప్పటికీ సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము కోరుకోము. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోండి.. మీ విక్టరీని వారు నాశనం చేస్తారు. మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి. రాష్ట్ర ప్రజలందరినీ ఒకేలా చూస్తూ వారిని ప్రేమించండి.. మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా చేయడానికి కనీసం ప్రయత్నమైనా చేయండి' అని నాగబాబు చెప్పారు.

Sat, Jan 18, 2020, 11:04 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View