తందై పెరియార్‌ను రజనీకాంత్ కించపరిచారు: పోలీసులకు ఫిర్యాదు
Advertisement
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చెన్నైలో కేసు నమోదైంది. ఈ నెల 14న నగరంలో జరిగిన ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ.. 1971లో సేలంలో ద్రావిడ పితామహుడు తందై పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని ఆరోపించారు. రజనీ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడ్డారు. పెరియార్ ర్యాలీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్‌ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
Sat, Jan 18, 2020, 10:17 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View