అనారోగ్యంతో బాధపడుతున్న శునకం.. రక్తదానం చేసిన మరో శునకం!
Advertisement
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులకు రక్తదానంతో పునర్జన్మ ప్రసాదించడం పరిపాటి. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ శునకం ప్రాణం నిలబెట్టేందుకు మరో శునకం రక్తాన్ని దానం చేసింది. కర్ణాటకలో జరిగిందీ ఘటన. సుందర పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మనీషా కులకర్ణి రెండేళ్లుగా రాట్ వైలర్ జాతి కుక్కకు ‘రానా’ అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ధార్వాడ్‌కు చెందిన గణేశ్ కూడా ఇదే జాతి శునకాన్ని ‘రోటీ’ పేరుతో పెంచుకుంటున్నాడు.

ఇటీవల కామెర్ల బారిన పడి రోటీ అనారోగ్యం పాలైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని కాపాడాలంటే రక్తం అవసరమని వైద్యులు చెప్పడంతో మనీష్ కులకర్ణిని గణేశ్ సంప్రదించి విషయం చెప్పాడు. అతడు అంగీకరించడంతో రానా రక్తదానం చేసింది. దాని రక్తాన్ని రోటీకి ఎక్కించారు. విషయం సోషల్ మీడియాకెక్కడంతో ‘రానా’ను పలువురు అభినందిస్తున్నారు.
Sat, Jan 18, 2020, 07:48 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View