సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
Advertisement
 *  దక్షిణాది అందాల తార కీర్తి సురేశ్ తొలిసారిగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే, తాజాగా ఈ ప్రాజక్టు నుంచి కీర్తి సురేశ్ బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సివుంది.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 20 నుంచి హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ అడవుల్లో జరుగుతుంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా పాల్గొంటారు.
*  రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'దర్బార్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు కలిపి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 160  కోట్లకు పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Sat, Jan 18, 2020, 07:22 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View