ట్వింకిల్ ఖన్నాకు వెరైటీగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అక్షయ్ కుమార్
Advertisement
వివాహమైన తర్వాత ఎలా వుంటుందో తమాషాగా పేర్కొంటూ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ రోజు అక్షయ్, ట్వింకిల్ ఖన్నాల పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఈ ఫొటోను పోస్ట్ చేసి సంచలనం రేపారు. తన భార్య నటి ట్వింకిల్ ఖన్నాను 2.0 చిత్రంలో తాను పోషించిన పక్షిరాజ గెటప్ తో ముద్దు పెట్టుకుంటూ ఫొటో తీసుకుని అభిమానులతో పంచుకున్నారు.

దీనితో పాటు ఓ సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు. ‘పెళ్లి తర్వాత జీవితం ఎట్లా ఉంటుందో అన్న దానికి ఈ చిత్రమే సాక్ష్యం. కొన్ని రోజులు ఆలింగనాలతో హాయిగా ఉంటుంది. మరికొన్ని రోజులు ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్లుగా ఉంటుంది.. ప్రేమతో నీ పక్షిరాజ’ అని ట్వింకిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ట్వింకిల్ కూడా లవ్ ఎమోజీ పంపారు.
 

Fri, Jan 17, 2020, 10:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View