ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన కుల్దీప్ యాదవ్
Advertisement
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) పోరాడడంతో లక్ష్యఛేదనలో ముందుకు సాగుతున్నట్టు అనిపించిన ఆసీస్ ను కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో స్మిత్, అలెక్స్ కేరీలను పెవిలియన్ చేర్చి భారత్ విజయావకాశాలను సజీవంగా నిలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 40 ఓవర్లలో 5 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 106 పరుగులు చేయాలి. టాపార్డర్ బ్యాట్స్ మెన్ అందరూ పెవిలియన్ చేరిన నేపథ్యంలో 341 పరుగుల లక్ష్యాన్ని కంగారూ లోయరార్డర్ ఎంతవరకు ఛేదిస్తుందన్నది సందేహమే! ప్రస్తుతం అస్టన్ టర్నర్, అగర్ క్రీజులో ఉన్నారు.
Fri, Jan 17, 2020, 08:49 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View