ఏపీ కేబినెట్ సమావేశం ప్రీపోన్.. రేపే భేటీ!
Advertisement
ఈనెల 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రీపోన్ అయింది. రేపే సమావేశాన్ని నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ముందు జరగడం మంచిదనే భావనతో తేదీని ముందుకు మార్చారు. కేబినెట్ భేటీ దాదాపు 3 గంటల సేపు కొనసాగే అవకాశం ఉంది. రాజధానికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ, హైపవర్ కమిటీ నివేదికల గురించి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
Sat, Jan 18, 2020, 07:44 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View