రజనీ వసూళ్లకు గండికొట్టిన ధనుశ్
Advertisement
రజనీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'దర్బార్' ఈ నెల 9వ తేదీన సంక్రాంతి బరిలోకి దిగింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగులో ఓ మాదిరి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. తమిళనాట మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రజనీ సినిమాకి పోటీగా ధనుశ్ మూవీ 'పట్టాస్' రంగంలోకి దిగింది.

ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా తమిళనాట దుమ్మురేపేస్తోంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధనుశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో, 'దర్బార్' వసూళ్లకు గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ వీకెండ్ లో ఈ ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలు .. ధనుశ్ ద్విపాత్రాభినయం ఆకట్టుకోవడం వల్లనే అక్కడ ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందనే అభిప్రాయాలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.
Fri, Jan 17, 2020, 04:47 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View