పౌరసత్వ సవరణ చట్టంపై.. కేరళ బాటలో పంజాబ్!
Advertisement
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై కేరళ బాటను కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ కూడా అనుసరించింది. సీఏఏను వ్యతిరేకిస్తూ.. కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ అసెంబ్లీ  కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది.  

సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని, రాష్ట్రంలో కూడా నిరసనలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఓకే చెప్పడంతో తీర్మానం నెగ్గింది. గతేడాది డిసెంబర్ లో కేరళ అసెంబ్లీ కూడా సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని విజయవంతంగా ఆమోదించింది.
Fri, Jan 17, 2020, 04:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View