జగన్ మూడు చాన్సులు ఇచ్చినా నేను అంగీకరించలేదు: పోసాని
Advertisement
వైఎస్ జగన్ అంటే తనకు అభిమానం అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పోసాని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. "తన క్యాబినెట్ లో నాలాంటి వ్యక్తి ఒకడుండాలని జగన్ భావించారు. నాకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు. ఆసక్తి లేదని చెప్పాను. అయినాగానీ ఓ ప్రతినిధిని పంపించారు. గంట పాటు చర్చలు కూడా జరిగాయి. అప్పటికీ నేను ఒప్పుకోలేదు. జగన్ నాతో జీవితకాలం ప్రేమగా మాట్లాడితే చాలు" అని వెల్లడించారు.

 అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తాను అడగకముందే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని వివరించారు. తానెప్పుడూ టికెట్ కావాలని చిరంజీవిని అడిగింది లేదని, పోటీ చేయాలని తనను బలవంతంగా ఒప్పించారని పోసాని చెప్పారు.
Fri, Jan 17, 2020, 04:09 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View