'ఎఫ్ 2' సీక్వెల్ పైనే దృష్టిపెట్టిన అనిల్ రావిపూడి
Advertisement .b
కథ ఏదైనప్పటికీ ఆ కథకి కామెడీని సమపాళ్లలో కలుపుతూ కడుపుబ్బా నవ్వించే దర్శకుడిగా అనిల్ రావిపూడి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ సక్సెస్  .. దర్శకుడిగా ఆయన స్థానాన్ని మరింత పెంచింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో .. ఏ బ్యానర్లో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.

అనిల్ రావిపూడి తదుపరి సినిమాగా 'ఎఫ్ 2'కి సీక్వెల్ ఉంటుందనేది తాజా సమాచారం. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ ఈ సీక్వెల్ లోను ఉంటారట. ఇక 'ఎఫ్ 2' సినిమాను నిర్మించిన 'దిల్' రాజు .. సీక్వెల్ కి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. 'ఫన్ .. ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్' అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దసరా బరిలోకి ఈ సినిమాను దింపొత్సని అంటున్నారు.
Fri, Jan 17, 2020, 03:45 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement .b
Advertisement .b
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View