అమెరికా బలగాలను తరిమికొడదాం.. మాతో చేతులు కలపండి: ఇరాన్
14-01-2020 Tue 12:02
- అమెరికా బలగాలు ఉన్నంత వరకు ఇక్కడ శాంతి ఉండదు
- ఇరాక్, సిరియాలు అస్థిరత్వానికి గురయ్యాయి
- యూఎస్ బలగాలను వెళ్లగొట్టడమే సరైన ప్రతీకారం

మధ్యప్రాచ్య ప్రాంతం (మిడిల్ ఈస్ట్) నుంచి అమెరికా బలగాలను తరమికొడదామని ఇరాన్ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో అమెరికా టెర్రరిస్టు బలగాలు (సైన్యం) ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో శాంతి, రక్షణ ఉండవని తెలిపింది. అమెరికా బలగాలను తరిమికొట్టేందుకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు తమతో చేతులు కలపాలని కోరింది. అన్ని దేశాలు ఒకటైతేనే అమెరికా బలగాలను వెళ్లగొట్టగలమని చెప్పారు.
ఇరాన్ జాతీయ భద్రతా విభాగం సెక్రటరీ అలీ షంఖానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇరాక్, సిరియా దేశాలు అమెరికా వల్ల అస్థిరత్వానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. అమెరికా బలగాలను వెళ్లగొట్టడం ఒక్కటే సరైన ప్రతీకారచర్య అని అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
More Latest News
మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్
6 minutes ago

జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
12 hours ago

'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
