ఉసూరుమనిపించిన దీపిక పదుకునే సినిమా కలెక్షన్లు
Advertisement
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన దీపిక పదుకునే తాజా చిత్రం 'ఛపాక్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. తొలిరోజు కేవలం రూ 4.77 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

దీనిపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ, హైఎండ్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఈ చిత్రం కొంతమేర రాణించిందని చెప్పారు. వారాంతం నేపథ్యంలో వసూళ్లు కొంతమేర పెరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు మాత్రం వసూళ్లలో విఫలమైందని చెప్పారు. టైర్-2, టైర్-3 సిటీలు, మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు.

ఈ చిత్రంలో దీపిక ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా... తొలిసారి నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమా ఆశించనమేరకు అలరించకపోవడంతో... నటిగా, నిర్మాతగా రెండు విధాలా దీపిక నష్టపోయినట్టైంది.
Sat, Jan 11, 2020, 02:20 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View