ఈనెల 20న ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్న అల్లు అరవింద్
Advertisement
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019' పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈనెల 20న ఢిల్లీలోని విజ్ఞానభవన్ లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అల్లు అరవింద్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. సమాజ సేవను ప్రోత్సహిస్తూ, సామాజిక అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఈ ఏడాది అల్లు అరవింద్ తో పాటు నలుగురు సీఎంలు, క్రీడాకారులతో పాటు మరికొందరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జస్టిస్ జ్ఞానసుధ, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సభ్యులుగా ఉన్న జ్యూరీ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
Sat, Jan 11, 2020, 12:52 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View