అల... వైకుంఠపురములో చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది!
Advertisement
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటించిన చిత్రం అల... వైకుంఠపురములో. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ పూర్తవగా, దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా నిడివి 165 నిమిషాలు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఓ పెద్ద కుటుంబంలా సంక్రాంతి వేడుక చేసుకుందాం అంటూ గీతా ఆర్ట్స్ తన ట్వీట్ లో అభిమానులకు పిలుపునిచ్చింది. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tue, Jan 07, 2020, 03:24 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View