రెగ్యులర్ షూటింగుకి సిద్ధమవుతున్న 'పింక్' రీమేక్
Advertisement
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 'పింక్' రీమేక్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టుగా సమాచారం. ముందుగా పవన్ పాత్రకి సంబంధం లేని ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తరువాత పవన్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడని అంటున్నారు. హిందీలో విజయవంతమైన 'పింక్' సినిమా, ఆ తరువాత తమిళ రీమేక్ గాను సక్సెస్ ను సాధించింది. దాంతో సహజంగానే తెలుగు రీమేక్ పై అంచనాలు వున్నాయి.
Tue, Jan 07, 2020, 03:08 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View