'జాను' సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్
Advertisement
శర్వానంద్ - సమంత జోడీగా 'జాను' రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్ ను విడుదల చేశారు. ఎడారి ప్రాంతంలో శర్వానంద్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, అతనికి ఒంటెలు ఎదురుపడటమనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఎడారిలో శర్వానంద్ ప్రయాణం ఏ వైపు? ఎవరి కోసం? అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

తమిళంలో 2018 చివర్లో వచ్చిన '96' సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాను రూపొందించిన ప్రేమ్ కుమార్ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమాకి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి కూడా బాణీలు కట్టాడు. తమిళంలో త్రిష - విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి పేరు సంపాదించుకుంది. రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న 'జాను' ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Tue, Jan 07, 2020, 10:29 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View