క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథతో సందీప్ వంగా
Advertisement
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా పాప్యులర్ అయ్యాడు. వసూళ్ల పరంగా లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, ఈ సినిమాతో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా ఆ కథకు తిరుగులేదనిపించాడు.

అలాంటి సందీప్ వంగాతో అదే సినిమా నిర్మాతలు మరో సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో సందీప్ వంగా వున్నాడని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఆయన ఈ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను తాము చేస్తామని స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు తెలియనున్నాయి.
Tue, Jan 07, 2020, 09:38 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View