ఆ సంఘటనే జీవిత రాజశేఖర్ ల పెళ్లికి దారితీసిందట
Advertisement
తెలుగు తెరపై హిట్ పెయిర్ గా రాణించిన హీరోహీరోయిన్లలో జీవిత - రాజశేఖర్ కనిపిస్తారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు అప్పట్లో భారీ విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి ప్రేమ - పెళ్లి గురించిన విషయాలను సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.

"ఓ తమిళ నిర్మాత రాజశేఖర్ జోడీగా జీవితను తీసుకున్నారు. అప్పుడే తొలిసారిగా జీవితను చూసిన రాజశేఖర్,ఆమెను తొలగించమని దర్శక నిర్మాతలకు చెప్పారు. అయితే వాళ్లు ఆయననే తొలగించి ఆమెను అలాగే ఉంచారు. ఆ తరువాత ఈ ఇద్దరూ 'తలంబ్రాలు' సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది.

ఆ తరువాత 'ఆహుతి' సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్ పై జీవితకి ఎంత ప్రేమ ఉందనేది ఆయన కుటుంబసభ్యులకు అర్థమైంది. దాంతో వాళ్లు ఈ ఇద్దరి పెళ్లికి అంగీకరించారు" అని చెప్పుకొచ్చారు.
Mon, Jan 06, 2020, 01:28 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View