‘మా’లో ఇటీవల జరిగిన గొడవపై రామ్‌ చరణ్‌ స్పందన
Advertisement
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో వివాదాలు బయటపడిన విషయం తెలిసిందే. హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. ఈ ఘటనపై రామ్ చరణ్‌ ‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన దీనిపై సమాధానాన్ని దాటేశాడు. 'మా'లోని సమస్యలను వారే పరిష్కరించుకుంటారని చెప్పాడు. అలాగే, సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను సినీ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు.

విజయవాడలోని బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్‌ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా రామ్ చరణ్‌ ఈ విధంగా స్పందించాడు. కాగా, చెర్రీని చూడడానికి అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
Mon, Jan 06, 2020, 12:35 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View