ఎలాంటి గొడవలు లేకుండా 'జబర్దస్త్' నుంచి బయటికి వచ్చేశాను: చమ్మక్ చంద్ర
Advertisement
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చమ్మక్ చంద్ర పాప్యులర్ అయ్యాడు. ఆ పాప్యులారిటీ ఆయనకి సినిమాల్లోను అవకాశాలను తెచ్చి పెడుతోంది. ఇటీవల ఆయన 'జబర్దస్త్' వేదికకి దూరమై, వేరే చానల్లో అదే తరహా వేదికపై సందడి చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'జబర్దస్త్' కార్యక్రమానికి చాలా కాలంగా దర్శకులుగా వున్న నితిన్ - భరత్, మల్లెమాల నుంచి బయటికి వెళ్లిపోయారు.

జీ చానల్ వారితో మాట్లాడుకుని, అక్కడ కామెడీ షో చేస్తున్నారు. చాలా కాలంగా వాళ్లతో కలిసి పని చేస్తుండటం వలన, నేను కూడా వాళ్లతో పాటు రావలసి వచ్చింది. నేను బయటికి వెళుతున్నట్టుగా 'మల్లెమాల' వారితో ముందుగానే చెప్పాను. మీకు ఎలా వీలైతే అలా చేయమని వాళ్లు అన్నారు. అక్కడి నుంచి వచ్చేసినా, మల్లెమాలపై .. జబర్దస్త్ పై నాకు వున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Mon, Jan 06, 2020, 11:20 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View