ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రావడం ఖాయమైపోయింది
Advertisement
'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా సతీశ్ వేగేశ్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మూడవ చిత్రంగా 'ఎంతమంచి వాడవురా' రూపొందింది. కల్యాణ్ రామ్ - మెహ్రీన్ జంటగా నిర్మితమైన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన రాకని ఖరారు చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కథనాలు .. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
Mon, Jan 06, 2020, 10:11 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View