అందాలు ఒలకబోస్తూ సమంత ఫొటోలు.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు
05-01-2020 Sun 11:55
- చీరలో సమంత ఫొటోలు
- ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన నేపథ్యంలో ఫొటో షూట్
- అలరిస్తోన్న సమంత ఫొటోలు

హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చీరలో అందాలు ఒలకబోస్తూ ఆమె కనపడుతోంది. కొత్త ఏడాది సందర్భంగా ఆమె ఫొటోలు పోస్ట్ చేసింది.
ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన నేపథ్యంలో ఆమె ఈ ఫొటో షూట్లో పాల్గొంది. ప్రస్తుతం ఈ అందాల భామ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న '96' రీమేక్‌తో పాటు 'ఫ్యామిలీమెన్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
టాలీవుడ్లో దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ సమంత నటించింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆమె అభిమానులను అలరిస్తోంది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
8 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
8 hours ago
