'అల వైకుంఠపురములో...' నిర్మాతలను ఒప్పించాం: దిల్ రాజు
Advertisement
సంక్రాంతి సీజన్ లో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, సినిమాల విడుదల విషయంలో అనిశ్చితి తొలగి పోయిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించారు. మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం 11వ తేదీన, అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో..' చిత్రం 12వ తేదీన విడుదల అవుతాయని, మరో రెండు చిన్న సినిమాలు కూడా రానున్నాయని ఆయన అన్నారు.

నిన్నటి వరకూ అల వైకుంఠపురములో చిత్రం విడుదల తేదీపై అయోమయం నెలకొందని, ఈ చిత్రం 10,లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశమై, సినిమాల విడుదలపై ఓ క్లారిటీ తెచ్చేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. అల్లు అర్జున్ చిత్రాన్ని 12న విడుదల చేయించేందుకు నిర్మాతలను ఒప్పించామని గిల్డ్ తరఫున కేఎల్ దామోదర్ ప్రసాద్, రాజీవ్ రెడ్డిలతో కూడిన బృందం చర్చలను సఫలం చేసిందని చెప్పారు.

సమావేశం పాజిటివ్ గా సాగిందని, రజనీకాంత్ వంటి స్టార్ హీరో చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కానుండటంతో కొంత అయోమయం నెలకొన్నా పరిస్థితి ఇప్పుడు సద్దుమణిగిందని దిల్ రాజు వ్యాఖ్యానించారు. అన్ని సినిమాలూ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
Sun, Jan 05, 2020, 08:02 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View