రూ.200 కోట్ల క్లబ్ లో 'గుడ్ న్యూస్' చిత్రం
Advertisement
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘గుడ్‌న్యూస్’ చిత్రం విడుదలైన మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టగా.. ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ. 161.90 కోట్లు, విదేశాల్లో రూ.45.86 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ.207.76 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాత కరణ్ జొహార్ ట్వీట్  చేసారు.

రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కృత్రిమ గర్భధారణ నేపథ్యంలో కొనసాగుతుంది. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గందరగోళం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం విజయం పట్ల అక్షయ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. గత ఏడాది  ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, ‘హౌస్ పుల్ 4’ సినిమాలతో వినోదం పంచిన అక్షయ్ ఏడాది చివర్లో.. డిసెంబర్ 27న విడుదలైన ‘గుడ్ న్యూస్’ చిత్రంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

ప్రస్తుత ఏడాదిలో కూడా అక్షయ్ కుమార్.. వరస సినిమాలతో అదే జోరును కొనసాగించనున్నారు.  నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్లోకి రావాలని సిద్ధమయ్యారు. కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌.. రోహిత్ శెట్టి సూర్య వంశీ.. పృథ్వీరాజ్ చిత్రాలతో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Sat, Jan 04, 2020, 06:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View