'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు
Advertisement
రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి వేదిక ఎక్కడనే విషయంతో పాటు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

రవితేజ సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముగ్గురు భామలతో తెరపై రవితేజ చేసే సందడి కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sat, Jan 04, 2020, 04:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View