ఆ కెమెరా మెన్ అలా అనడంతో ఏడ్చేశాను: సీనియర్ నటి కవిత
Advertisement
జయసుధ .. జయప్రద .. శ్రీదేవి స్టార్ హీరోయిన్స్ గా తమ జోరు చూపిస్తున్న కాలంలోనే కవిత ఇండస్ట్రీకి వచ్చారు. కథానాయికగా తనకి వచ్చిన పాత్రలను సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. అలాంటి కవిత తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.

"ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను. అందరితోనూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుకుంటూనే ఉంటాము. అందరూ నా గ్లామర్ ను .. నటనను మెచ్చుకున్నవారే. సినిమాటోగ్రాఫర్ వీఎస్సార్ స్వామి గారు ఒక రోజున ఒక మాట అన్నారు. 'నా లైఫ్ లో ముగ్గురికి క్లోజప్ లు తీయడానికి నేను ఇష్టపడతాను. ఒకటి సావిత్రిగారు .. రెండు వాణిశ్రీ గారు .. మూడు కవితగారు" అన్నారు. ఆయన అలా అనడంతో అక్కడే వున్న నేను ఆనందం తట్టుకోలేక ఏడ్చేశాను. ఇక కెమెరామెన్ లోక్ సింగ్ గారు కూడా అదే మాట అన్నారు" అని చెప్పుకొచ్చారు.
Sat, Jan 04, 2020, 04:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View