పేరులో మార్పు చేసుకున్న విజయ్ దేవరకొండ
Advertisement
విజయ్ దేవరకొండ .. యూత్ లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ తరం కుర్రాళ్లకు విజయ్ దేవరకొండ రోల్ మోడల్ గా మారిపోయాడు. అలాంటి విజయ్ దేవరకొండ తన పేరులో మార్పు చేసుకున్నాడు. 'దేవరకొండ విజయ్ సాయి'గా తన పేరులో మార్పు చేసుకున్నాడు. తన తాజా చిత్రమైన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ వలన ఈ విషయం స్పష్టమైంది.

కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్ తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకోవచ్చునేమో. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా.. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ అలరించనున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Sat, Jan 04, 2020, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View