నా కెరియర్‌లో దర్బార్ సినిమా చాలా స్పెషల్: మురుగదాస్
Advertisement
తన కెరియర్‌లో 13 సినిమాలు చేసినప్పటికీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో తాను చేసిన తొలి సినిమా ఇదేనన్నారు. అంతేకాదు, తాను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ కూడా ఇదేనని పేర్కొన్నారు. అందరూ బాగా కష్టపడి పనిచేయడంతో సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు.

ఈ సినిమా నిర్మాత సుభాస్కరన్ నిజ జీవిత హీరో అని, భవిష్యత్తులో ఆయనపైనా బయోపిక్ తీయవచ్చని మురుగదాస్ పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమాకు కావాల్సింది ఇలాంటి నిర్మాతలేనన్నారు. ‘దర్బార్’లో నయనతార, నివేదా థామస్‌లు చాలా చక్కగా నటించారని ఆయన కొనియాడారు. రజనీకాంత్‌తో పోటీపడి మరీ సునీల్ శెట్టి విలనిజాన్ని పండించారని మురుగదాస్ ప్రశంసించాడు.
Sat, Jan 04, 2020, 07:14 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View