'వాలిమై'లో పోలీసాఫీసర్ పాత్రలో అజిత్
Advertisement
వరుస విజయాలతో అజిత్ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా అజిత్ కి 60వ సినిమా. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాదులో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ అవుట్ పుట్ సూపర్ గా వచ్చిందనేది యూనిట్ చెబుతున్న మాట. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తికావడంతో ఈ సినిమా టీమ్ చెన్నైకి చేరుకుంది. తదుపరి షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో అక్కడ మొదలుకానుంది.

ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన కెరియర్లో చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
Fri, Jan 03, 2020, 02:57 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View