విజయ్ దేవరకొండతో జాన్వీ జోడీ కట్టడం లేదట
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా పూరి 'ఫైటర్' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశంతో, కథానాయికగా ఆయన జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

తనకి విజయ్ దేవరకొండ స్టైల్ నచ్చుతుందనీ, ఆయనతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చెప్పింది. అందువలన తెరపై ఈ జోడీ కనువిందు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా వున్న కారణంగా తను ఈ సినిమా చేయడం కుదరదని జాన్వీ చెప్పిందనేది బాలీవుడ్ టాక్. ఇది విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. అయితే ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది.
Fri, Jan 03, 2020, 12:30 PM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View