కెరియర్ ఆరంభంలో పారితోషికంగా రోజుకి 4 వేలు ఇచ్చారు: హీరోయిన్ ధన్య బాలకృష్ణ
Advertisement
తెలుగు చిత్రపరిశ్రమలోకి ధన్య బాలకృష్ణ అడుగుపెట్టి కొంతకాలం అయింది. హీరోయిన్లకు స్నేహితురాలిగా ఆమె కొన్ని చిత్రాల్లో కనిపించింది. ఆ తరువాత ముఖ్యమైన పాత్రల్లోను మెరిసింది. ఇక ఇటీవలే ఆమెకి హీరోయిన్ గాను అవకాశాలు వస్తున్నాయి. 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ రోజున 'హల్ చల్' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో పారితోషికంగా తనకి రోజుకి 4 వేలు మాత్రమే ఇచ్చినట్టుగా చెప్పింది. అది చాలా తక్కువ మొత్తమే అయినా, నటన పట్ల తనకి గల ఆసక్తితో అడుగులు వేస్తూ వచ్చానని అంది. ప్రస్తుతం హీరోయిన్ గా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఆమె, తన పారితోషికాన్ని ఏ స్థాయిలో పెంచిన విషయాన్ని మాత్రం సస్పెన్స్ లోనే ఉంచింది. ఒకటి రెండు హిట్లు పడితే ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Fri, Jan 03, 2020, 12:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View