విమానంపై ‘దర్బార్’ పోస్టర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న రజనీ సినిమా ప్రచారం
Advertisement
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘దర్బార్’ ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. రోజుకో కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది చిత్ర యూనిట్.
 
మరోవైపు, ఈ సినిమా ప్రచారాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. గతంలో రజనీకాంత్ సినిమా ‘కబాలి’కి చేసినట్టుగా విమానాలపై దర్బార్ పోస్టర్లు అతికించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది చూసిన వారు రజనీ సినిమానా, మజాకా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, దర్బార్ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.
Fri, Jan 03, 2020, 09:53 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View