మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ ప్రారంభం
Advertisement
గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో అభిమానుల, ప్రేక్షకుల మదిని దోచిన టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా నటిస్తున్న 152వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గత ఏడాది విజయ దశమి రోజు జరిగినప్పటికీ.. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఓ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టింది. దేవాదాయ శాఖలో అవినీతిని అరికట్టే కథాంశంతో కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా ఇందులో కనిపించనున్నారు.

వైరల్ గా మారిన చిరంజీవి న్యూలుక్
మరోవైపు చిరంజీవికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. సాదా సీదాగా కొత్త లుక్ తో చిరంజీవి ఆకర్షణీయంగా కన్పిస్తున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి తన 152వ చిత్రానికి సంబంధించినదే ఈ గెటప్ అని పేర్కొంటున్నారు. ఆగస్టు 14న సినిమా విడుదలకు సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Thu, Jan 02, 2020, 05:39 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View